ADB: పండించిన పంటలను అమ్ముకునేందుకు జిల్లా మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతుల కోసం మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో 10 రూపాయలకే భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ఈ నెల 13 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.