HNK: ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన వరికోలు గ్రామంలో ప్రజలకు ఎమ్మెల్సీ కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. వరికోలు గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు.