SRD: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 21వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఒక్కో పాఠ్యాంశానికి రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్ష ఫీజును మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలి.