NLG: దేవరకొండలోని సాయి శివ గార్డెన్ ఎదురుగా నూతనంగా వైన్ షాపు, పర్మిట్ రూము ఏర్పాటు వద్దని కాలనీవాసులు మంగళవారం నిరసన తెలిపారు. నివాస గృహాల మధ్య, ఓపెన్ జిమ్, చర్చి, శివాలయం దారి, స్కూల్ వ్యానులో మహిళలు పిల్లల్ని అక్కడ బస్సు ఎక్కించే ప్రాంతం కావడంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.