JN: జనగామ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జనగామలో ఉదయం స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ జనగామ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.