SRPT: ఈనెల 14న జరగబోయే పోలింగ్ సందర్భంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఇవాళ హెచ్చరించారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు మండల వ్యాప్తంగా భద్రతను పెంచామని అన్నారు.