NZB: చందూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ పక్కన చెత్తా, చెదారం పేరుకుపోతుందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు ఇదే విషయమై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త వేసిన ప్రదేశంలో దోమలు చేరడంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. పంచాయితీ అధికారులు ఇప్పటికైనా స్పందించి, చెత్త వేసేవారికి నోటీసులు ఇచ్చి పరిష్కరించాలన్నారు.