WGL: భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు అని HIT TVలో వచ్చిన కథనంపై ఈవో సునీత స్పందించారు. ఈ మేరకు ఆలయ బుకింగ్ కౌంటర్లో పని చేస్తున్న శరత్, నరేందర్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం అర్చకులు, సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. భక్తులకు నచ్చితే తోచిన సంభావణ మాత్రమే ఇవ్వాలని, డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.