SRPT: తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తరలింపునకు లారీలు, హమాలీల కొరతను వెంటనే తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.