NLG: భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని శాలిగౌరారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమర రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలిగౌరారం నుంచి భైరవునిబండ వయా అమ్మనబోల్, వంగమర్తి, చిత్తలూరు, ఆర్ అండ్ బీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వారి వెంట చింత ధనుంజయ, వడ్లకొండ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.