ASF: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థులను కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థినిలు క్రమశిక్షణ, సామర్థ్యం, కఠోర శ్రమతో సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణమన్నారు. ఇందులో పలువురు అధికారులు పాల్గొన్నారు.