MBNR: జడ్చర్లలోని గురుకుల పాఠశాల విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు గురై ఉంటారని బయటపడ్డ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. వనపర్తి జిల్లా భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయి లీలా ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి నిందితులని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.