నిజామాబాద్: ఎల్లారెడ్డి మండలం వెలుట్ల గ్రామానికి చెందిన బైండ్ల సాయమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గణేష్ ఉన్నారు.