నల్లగొండ జిల్లా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువు నందు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజుల మున్సిపల్ ఛైర్పర్సన్ రజిత తదితరులు పాల్గొన్నారు.