BHPL: పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆదివారం గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులకు వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రధాన రహదారులపై నిరంతరం నీటిని చల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు ధూళి కూడా నియంత్రణలోకి వచ్చి భక్తులకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.