SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల తొలిరోజు కార్యక్రమాలు కన్నుల పండువగా, వినుల విందుగా సాగాయి. సాయంత్రం అనుపమ హరిబాబు బృందం శాస్త్రీయ సంగీత కచేరి, వి.జానకి బృందం శాస్త్రీయ సంగీతంతో సంగీతాభిమానులను అలరించారు.