ఖమ్మం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీ, జిల్లాలోనే అత్యధిక ఓటర్లు (45,256), వార్డులు (32) కలిగిన పురపాలికగా నిలిచింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 26 అభ్యంతరాలు రాగా, బీఎల్డీల విచారణ అనంతరం ఈ నెల 10న తుది జాబితా ప్రకటించనున్నారు. కాగా, అత్యధికంగా ఒకటో వార్డులో 1,710 మందిని గుర్తించారు.