NZB: నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి, మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా లడ్డూ, పులిహోర విక్రయాల కోసం శుక్రవారం వేలం నిర్వహించనున్నట్లు ఈవో రవీందర్ గుప్తగురువారం తెలిపారు. ఉ. 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం పాట ఉంటుందని, ఆసక్తి గల వారు రూ.10,000 డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చని పేర్కొన్నారు.