SRD: న్యాల్కల్ మండలంలోని మల్గీ గ్రామం నుండి బైపాస్కు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు, రాళ్లు ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. రైతులు, ఉద్యోగులు, ప్రతిరోజూ ఈ మార్గాన్నే వినియోగిస్తున్నప్పటికీ రహదారి దుస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.