MDK: గుర్తుతెలియని ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలైన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని అక్కన్నపేట గ్రామ శివారులో గుర్తుతెలియని ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.