NLG: ఎంజీ యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, 17వ తారీఖు వరకు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.