KMM: నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు AE మైథిలి తెలిపారు. ఆదివారం మధిర మండలం ఖమ్మంపాడు, నాగవరప్పాడు, ఇల్లందులపాడు, మాటూరుపేట గ్రామాల్లో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.