MDK: డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. మెదక్ బాలికల పాఠశాల కేంద్రంగా ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమతో పాటు పెన్సిళ్లు, రంగులు, రైటింగ్ ప్యాడ్లు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరికరాలను తెచ్చుకోవాలని ఆమె సూచించారు.