MHBD: గుడుంబా తయారీ కోసం నల్ల బెల్లం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కురవి రైల్వే గేటు అనంతారం సమీపంలో రైలులో బెల్లం తరలిస్తున్న గుగులోతు నిజ్జు, దేశులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి వెల్లడించారు. గుడుంబా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.