MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎఫ్ఎస్టీ బృందం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 24 బీర్ బాటిల్స్, 48 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఎస్టీ బృందం తెలిపారు.