ఖమ్మంలో ఇటీవల లంబాడీల వనభోజనం మహోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. కాగా ఈ మహోత్సావాన్ని విజయవంతం చేసినందుకు TG లంబాడీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త భూక్య శోభన్ నాయక్ లంబాడీ సోదరులకు ఇవాళ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ జాబితా నుంచి తమను తొలగించాలనే రాజకీయ కుట్రను మానుకోవాలని, ఎస్టీలను విడగొట్టాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చేప్తామని హెచ్చరించారు.