NLG: ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించి పేదలకు ఖరీదైన వైద్యం భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేములవీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.