BHPL: గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కావటి రజిత-రవి గెలుపు కోసం MLA గండ్ర సత్యనారాయణ రావు, DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే.. కత్తెర గుర్తుకు ఓటేసి కావటి రజిత-రవిని గెలిపించాలని ఓటర్లను కోరారు.