MNCL: భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందన్నారు.