BHPL: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఇవాళ రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి రేగొండ మండల అధ్యక్షుడు నరసయ్య, టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.