వరంగల్ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం బయటకు వచ్చింది. ఇద్దరు ఉద్యోగులు ఒకే సీరీస్ నంబర్లున్న టికెట్లను భక్తులకు విక్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాజీపేటకు చెందిన భక్తుడు నకిలీ టికెట్లు ఉన్నాయంటూ ఆలయం ఈవో రామల సునీతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ బోర్డులో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు.