HYD: శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 710 గ్రాముల గంజాయిని స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఎన్టీఎఫ్ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్ ప్రాంతంలో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై మంజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మంగ్లీ నరేష్ అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.