BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. స్వామివారి గిరిప్రదక్షిణ అవకాశం, గర్భాలయ దర్శనం ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించిన దేవస్థానం ఈవో వెంకట్రావు, అధికారులకు స్థానిక అయ్యప్ప సేవ సమితి వారు కృతజ్ఞతలు తెలిపి, వారిని ఘనంగా సన్మానించారు.