MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇవాళ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్, సర్పంచ్ సుమలత, కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.