NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాల కోసం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను జూన్ 2న ప్రకటించాలని జిల్లా కేంద్రంలో డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మే 27, 28 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు తెలిపారు. లబ్ధిదారుల ప్రకటనలో ఆలస్యం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.