SRD: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణకు కేటాయించిన కేంద్రాలలో జిల్లా ఉపాధ్యాయులందరూ తప్పక హాజరు కావాలని ఆయన సూచించారు.