JGL: ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్ 23, వార్డు సభ్యుల 216 అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు, తదితర అంశాలపై ఎన్నికల పరిశీలకుల ద్వారా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.