WNP: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. వనపర్తి పట్టణంలోని 7వార్డు నుంచి సింగనమోనీ వెంకటయ్య ఆధ్వర్యంలో 200 మంది మహిళలు, యువకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు.