GDWL: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరప్రదాయిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని 114 మంది లబ్ధిదారులకు సుమారు రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. అననంతరం మాట్లాడుతూ.. కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.