ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.