JGL: జిల్లాలో వడగాలుల ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, అనంతరం 1-2 డిగ్రీల వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ జిల్లాలో వడగాలుల ప్రభావం కొనసాగవచ్చని అధికారులు సూచించారు. దీంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.