MNCL: కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలోని శ్రీ పోచమ్మ అమ్మవారిని MLA గడ్డం వినోద్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.