MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాకు పూర్వ వైభవం రానుందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గోలేటి జీఎం కార్యాలయంతో పాటు గోలేటి ఉపరితల గని, MBK-2 ఉపరితల గని ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ద్వారా కొత్తగనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కొత్త గనులు ప్రారంభిస్తామన్నారు.