HYD: మీర్ఖాన్పేటలో జరుగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వంద ఎకరాల ప్రాంగణంలో కాలినడకన సందర్శిస్తూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ముంబైలోని కొరియా కాన్సుల్ జనరల్ డాంగ్వాన్, డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి, HYDలోని కొరియా సంస్థలు, పౌరుల భద్రత అంశాలపై చర్చించారు.