KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఉన్నత పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఒకేచోటికి చేరిన స్నేహితులు తమ చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు చాటుకున్నారు.