WNP: CPI, కమ్యూనిస్టులు లేని సమాజం జీవం లేని అస్థిపంజరం వంటిదని CPI రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. నాగర్కర్నూల్లో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీపీఐ త్యాగధనుల పార్టీ అని, అందులో ఉన్నందుకు గర్వించాలని చెప్పారు. పేదలకు సీపీఐ కన్నతల్లి లాంటిదని, అనేక చట్టాలు తమ పోరాటంతోనే వచ్చాయని తెలిపారు.