MBNR: హన్వాడ మండలం చిన్నదర్పల్లి గేటు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామకృష్ణ తన తల్లి సుజాతతో కలిసి రోడ్డు దాటుతుండగా మహబూబ్నగర్ నుంచి పరిగి వైపు వెళుతున్న ఆర్టిసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. సీరియస్గా ఉండడంతో అతడిని హైదరాబాద్ తరలించారు.