WGL: జిల్లాలోని 518 పాఠశాలలకు ‘స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్’ కింద రూ.76.65 లక్షలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద విడుదల చేశారు. జీడబ్ల్యూఎంసీ ప్రాంతంతో సహా అన్ని పాఠశాలల సంబంధిత ఏఏపీసీ ఖాతాలకు ఆర్టీజీఎస్/నెఫ్ట్ ద్వారా ఈ మొత్తం బదిలీ అయింది. పాఠశాలల సౌకర్యాలు, నిర్వహణ మెరుగుపరచేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.