SDPT: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే, గ్రామ అభివృద్ధి కోసం రూ.25 లక్షల నిధులు ఇప్పిస్తానని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం సిద్దిపేటలో మాట్లాడుతూ.. ఈ డబ్బులు చేతికి ఇవ్వనని కేవలం రూ.25 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేయిస్తానని స్పష్టం చేశారు. ఏకగ్రీవాల కోసం వేలం పాటలు పాడడం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరచడమే అన్నారు.