MHBD: జిల్లాలో చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో DMHO డా. రవిరాథోడ్ పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు వెచ్చగా ఉండటానికి స్వెటర్లు వేసి చెవులకు వెచ్చదనం కోసం టోపి పెట్టాలన్నారు. వీలైతే కాళ్లకు చేతులకు సాక్సులు, గ్లౌస్లు వేయాలని,నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలన్నారు. ఉదయం పూట ఎండలో ఉంచాలని, చిన్నారులతో ఉదయం ప్రయాణాలు చేయొద్దని తెలిపారు.